Telangana TET | టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు
Telangana TET | టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు
ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ
దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 20 వరకు గడువు
జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్ పరీక్షలు
Hyderabad : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల ప్రక్రియ గురువారం రాత్రి నుంచి ప్రారంభమైంది. అయితే తొలుత టెట్ దరఖాస్తుల ఈ నెల 5 నుంచి ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత తలెత్తిన సాంకేతిక సమస్యల నేపథ్యంతో దరఖాస్తు ప్రారంభ తేదీలో మార్పులు చేశారు. దీంతో గురువారం రాత్రి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అయితే టెట్ దరఖాస్తు ఫీజును తగ్గించారు. గతంలో టెట్ పేపర్ 1 కు రూ.1000 ఉండగా.. ఇప్పుడు రూ.750 గా నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో పేపర్ -2 కు రూ.2000 ఫీజు ఉండగా, ఇప్పుడు రూ.1000 తగ్గించినట్లు తెలిపారు. అలాగే గత మేలో టెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకోవడం కోసం ప్రస్తుత టెట్‌కు ఫీజు లేకుండానే దరఖాస్తులు చేసుకోనే సౌకర్యాన్ని టెట్ అధికారులు కల్పించారు. అయితే టెట్ దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు గడువు విధించారు. జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు నిర్వహించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేసే విధంగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
* * *
Leave A Comment